తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ ('పరుత్తి వీరన్' ఫేమ్) కథానాయకుడుగా తమిళంలో రూపొందుతున్న 'ఆయరత్తిల్ ఒరువన్' చిత్రం తెలుగులోనూ ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కు 'యుగానికి ఒక్కడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపై ఆర్.రవీంద్రన్ ఈ ద్విభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '7/జి బృందావన్ కాలనీ' వంటి హిట్ చిత్రాలను అందించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు. రీమాసేన్, ఆండ్రియా జెరోమియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.నిర్మాత రవీంద్రన్ మాట్లాడుతూ, ఇదొక సోషియో ఫాంటసీ థ్రిల్లర్ అనీ, 40 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. థ్రిల్లర్ అయినప్పటికీ వాణిజ్య విలువలు పుష్కలంగా ఉంటాయనీ, హైద్రాబాద్, కేరళ, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. జనవరి మొదటివారంలో ఆడియో, సంక్రాంతి కానుకగా రెండు భాషల్లోనూ ఏకకాలంగా సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో పార్దీబన్, ప్రతాప్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శ్రీరాఘవ అందించిన ఈ చిత్రానికి శ్రీరామకృష్ణ మాటలు, భువనచంద్ర-అనంత శ్రీరామ్ పాటలు, రామ్ జీ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటింగ్, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్, జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు.సంక్రాంతికి 'యుగానికి ఒక్కడు'
తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ ('పరుత్తి వీరన్' ఫేమ్) కథానాయకుడుగా తమిళంలో రూపొందుతున్న 'ఆయరత్తిల్ ఒరువన్' చిత్రం తెలుగులోనూ ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు వెర్షన్ కు 'యుగానికి ఒక్కడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపై ఆర్.రవీంద్రన్ ఈ ద్విభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '7/జి బృందావన్ కాలనీ' వంటి హిట్ చిత్రాలను అందించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు. రీమాసేన్, ఆండ్రియా జెరోమియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.నిర్మాత రవీంద్రన్ మాట్లాడుతూ, ఇదొక సోషియో ఫాంటసీ థ్రిల్లర్ అనీ, 40 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. థ్రిల్లర్ అయినప్పటికీ వాణిజ్య విలువలు పుష్కలంగా ఉంటాయనీ, హైద్రాబాద్, కేరళ, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. జనవరి మొదటివారంలో ఆడియో, సంక్రాంతి కానుకగా రెండు భాషల్లోనూ ఏకకాలంగా సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో పార్దీబన్, ప్రతాప్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శ్రీరాఘవ అందించిన ఈ చిత్రానికి శ్రీరామకృష్ణ మాటలు, భువనచంద్ర-అనంత శ్రీరామ్ పాటలు, రామ్ జీ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటింగ్, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్, జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment