'ధర్మవరపు సై-ఆట'

క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించిన ధర్మవరపు సుబ్రమణ్యం దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెర వీక్షకులను అలరించబోతున్నారు. 'ధర్మవరపు సై-ఆట' పేరుతో ఓ సరికొత్త వినోదాత్మక ప్రోగ్రామ్ సంక్రాంతి పండుగ నుంచి ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారం కానుంది.ధర్మవరపు గతంలో 'ఆనందో బ్రహ్మ', 'చల్ మోహనరంగ' వంటి కామెడీ ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ప్రేక్షకులను అలరించారు. 'ధర్మవరపు సై-ఆట' కూడా ఇదే తరహాలో నవ్వుల వినోదం పంచుతూ ఒక సామాజిక సందేశాన్ని కూడా అందించనుంది. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనదలచిన వారు Dharmavarapu2010@gmail.com కు ఇ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కు 'కేమ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్' నిర్మిస్తుండగా, పమిడికల్వ మధుసూదన్ దర్శకుడు

No comments:

Post a Comment