చెన్నైలోని తన నివాసంలో వ్యభిచారం చేస్తూ నాలగు రోజుల క్రితం చెన్నై వ్యభిచార నిరోధక విభాగం పోలీసులకు చిక్కిన నటి భువనేశ్వరి మరికొంత మంది నటీమణులకు సైతం తాజాగా 'బ్రోతల్స్' రంగు పులమడం చెన్నై సినీ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'ఇంకా చాలమంది నటీమణులు ఇదే వ్యాపారం చేస్తున్నారు. నాతో పాటు వాళ్లను కూడా అరెస్టు చేయండి' అంటూ భువనేశ్వరి పోలీసు ఇంటరాగేషన్ లో మరికొందరి గుట్టు బయట పెట్టినట్టు సమాచారం. భువనేశ్వరి బయట పెట్టినట్టు చెబుతున్న కొందరి పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఆ నటీమణుల పేర్లు ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాలేదు. అయితే ప్రముఖ తమిళ దినపత్రిక 'దినమలర్' మాత్రం ఓ అడుగు ముందుకు వేసి...భువనేశ్వరి కొందరి పేర్లు పోలీసులకు వెల్లడించిందంటూ తాజాగా ఓ వార్త ప్రచురించింది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఇద్దరు ప్రముఖ హీరోయిన్ల పేరు భువనేశ్వరి ప్రముఖంగా ప్రస్తావించిందనీ, అందుకు తగిన సాక్ష్యాధారులు తన వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేసిందనీ ఆ వార్తా కథనంలో పత్రిక పేర్కొంది. ఆ ఇద్దరి హీరోయిన్ల పేరు కూడా 'దినమలర్' ప్రచురించింది. ఆ ఇద్దరు హీరోయిన్లు తెలుగులో పేరున్న హీరోయిన్లు కావడం, టాలీవుడ్ లోనే తమ కెరీర్ ను ప్రారంభించడం విశేషం.భువనేశ్వరి చెప్పినట్టు పేర్కొంటున్న హీరోయిన్ల పేర్లు పత్రికలో రావడాన్ని తమిళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆర్టిస్టుల కుటుంబాల్లో ఇలాంటి వార్తలు చిచ్చుపెట్టే అవకాశాలున్నాయంటూ సదరు పత్రికపై దక్షిణ భారత ఆర్టిస్టుల సంఘం పరువునష్టం కేసు వేయాలని నిశ్చయించినట్టు కూడా తెలిసింది. భువనేశ్వరి రేపిన దుమారం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయోనని పలువురు ఆర్టిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
No comments:
Post a Comment