
ఆదిత్యబాబు ఆ వివరాలను వెల్లడిస్తూ, అల్లు అర్జున్ గతంలో నటించిన 'ఆర్య' స్టయిల్ లోనే ఈ సినిమా ఉటుందనీ, అయితే 'ఆర్య' కథకు మాత్రం ఇది కొనసాగింపు కాదనీ చెప్పారు. కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలమనీ, అల్లు అర్జున్ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందనీ తెలిపారు. తొలి వెర్షన్ కు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా చక్కటి బాణీలు అందించారనీ, నవంబర్ 1న సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తామనీ చెప్పారు. అదే నెల రెండో వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఆర్య-2లో అల్లు అర్జున్ చేసే ప్రతి పని కొత్తగా ఉంటుందనీ, అది ప్రేక్షకులను అలరిస్తుందనీ దర్శకుడు సుకుమార్ తెలిపారు
No comments:
Post a Comment