
వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ అమ్మాయిగా బిందు మాధవి నటించనుందని తెలుస్తోంది. దీనికి 'కొంచెం కొత్తగా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. దీనితో పాటు రామ్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మించనున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలోనూ బిందు మాధవి ఒక హీరోయిన్ గా ఎంపికైంది. త్రీ ఏంజెల్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న 'ఓం శాంతి'చిత్రంలోనూ నిఖిల్ కు జోడిగా బిందుమాధవి నటిస్తోంది. మరో జంటగా నవదీప్, కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం ప్రోగ్రస్ లో ఉంది. మరిన్ని కొత్త ఆఫర్లు కూడా ఇప్పుడు బిందు మాధవి పరిశీలనలో ఉన్నాయి
No comments:
Post a Comment