
కాలేజీ నేపథ్యంలో జరిగే ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇదనీ, ఇందులో శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుందనీ రాజేంద్రకుమార్ తెలిపారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ లపై తీసిన కామెడీ ట్రాక్ నవ్వుల వినోదం పంచుతుందని అన్నారు. ప్రేమకథల్లో ఓ కొత్త కోణం చూపే చిత్రమిదనీ, అన్ని వర్గాల ఆడియెన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంటుందనీ నిర్మాతలు తెలిపారు. నవంబర్ లో మయూరి సంస్థ ద్వారా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి జయరామ్ సినిమాటోగ్రఫీ, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.
No comments:
Post a Comment