'ప్రతిఘటన' చిత్రంలో ప్రతినాయకుడుగా నటించిన చరణ్ రాజ్ విలనీ ఇప్పటికీ జనం మరచిపోరు. ఆ తర్వాత కూడా ఆయన పలు చిత్రాల్లో నటించారు. 13 భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో ఆయన నటించారు. ఇటీవల కాలంలో ఆయన నటన కంటే సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన దర్శకత్వ పగ్గాలు కూడా చేపట్టబోతున్నారు. అది కూడా ఓ యదార్ధ ప్రేమగాథను ఆయన తెరకెక్కించబోతుండటం విశేషం. ఈ లవ్ స్టోరీ వెనుక ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి.
'అనితా ఓ అనితా నా అందమైన అనిత కాస్తయినా దయలేదా నా పేద ప్రేమ పైన' అనే ప్రైవేటు గీతం ఇటీవల కాలంలో సంచలం అయి కూర్చుంది. ఈ పాటను సెల్ ఫోన్స్ లో డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ పాట రాసిందెవరు? అతని ప్రేమ విఫలమైందా? ఆయన బతికే ఉన్నాడా? అనేది యూత్ లో ప్రధాన చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేట్ ఛానెల్ జరిపిన అన్వేషణలో ఆ అజ్ఞాత రచయిత బయటపడ్డారు. అతని పేరు నాగరాజు అని తెలుసుకుని అతన్ని ఆ ఛానెల్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ వ్యక్తినే చరణ్ రాజ్ కలుసుకుని అతని నుంచి సేకరించిన విషయాలతో స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాగరాజు చెప్పిన ప్రేమకథ విని చలించిపోయాననీ, దానినే సినిమాగా తీస్తే యువతరంలో చాలా మార్పు వస్తుందనే నమ్మకంతో సిఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నట్టు చరణ్ రాజ్ తెలిపారు. దీనికి నాగరాజు స్క్రిప్టు అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలు తెలియజేస్తాననీ, నవంబర్ లో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నాననీ చెప్పారు

No comments:
Post a Comment