
చిత్ర విశేషాలను నిర్మాత శ్రీకాంత్ తెలియజేస్తూ, అపార్ట్ మెంట్ లో జరిగే వివిధ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందనీ, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయనీ చెప్పారు. ఓ ప్రముఖ హీరోయిన్ ఇందులో నటిస్తుందనీ, త్వరలోనే ఆ పేరు ప్రకటిస్తామని సతీష్ వేగేష్న తెలిపారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేస్తామన్నారు. దర్శకుడు రాజు వి మాట్లాడుతూ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 70 శాతం హైద్రాబాద్ లో నూ, మిగతా భాగం చెన్నైలోనూ చేస్తామని అన్నారు. 'ఏప్రిల్ 1 విడుదల' తరహాలో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇందులోని నాలుగు పాటలకు ఖుద్దూస్ సంగీతం అందిస్తారని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుజాతా రెడ్డి, అల్లరి సుభాషిణి, రక్ష, మల్లేష్, తడివేలు, రమ్య, సుబ్బరాజు, ఉత్జేజ్, పృధ్వీ తదితరులు నటించనున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రాజు వి. అందిస్తున్న ఈ చిత్రానికి సాబుజెమ్స్ సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్ అందిస్తారు.
No comments:
Post a Comment