'అమ్మా లేదు...నాన్నా లేదు..చెల్లీలేదు..తంబీలేడు...ఏక్ నిరంజన్' పాట కొద్దిరోజులుగా హోరెత్తిపోతోంది. ఎవరూ లేనివాడు అనాథ. కొంచెం పాలిష్డ్ గా చెబితే 'ఏక్ నిరంజన్'. అలా చెప్పడమే దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టయిల్. టైటిల్స్ చూసి దర్శకుడు ఇ.వి.వి.నో పూరీనో ఇట్టే చెప్పేసే పరిజ్ఞానం తెలుగు ప్రేక్షకుల సొంతం. ఇనీషియల్ ఓపినింగ్స్ ను టైటిల్స్ ఎట్రాక్ట్ చేస్తే, సినిమాలోని స్టఫ్ (కథ-కథనం-మషాలా దినుసులు వగైరా) బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. పూరీ జగన్నాథ్ కొద్దికాలంగా సంచలనం సృష్టించగల స్టార్ కాస్ట్ ను ఎంచుకుంటున్నప్పటికీ నల్లేరు మీద నడకలాంటి కమర్షియల్ యాక్షన్ ఫార్ములాలతోనే సరిపుచ్చుకుంటున్నారు. చెప్పిందే చెపితే చర్వితచర్వణమే అవుతుంది కానీ కొత్తదనం అనిపించదు. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను కూర్చోబెట్టడం ఒక్కటే సరిపోదు. గేటు బయటకు వస్తే గుర్తుపెట్టుకోవడానికి ఏముందని ప్రేక్షకుడు తడుముకోకూడదు. అదే జరిగితే రిపీటెడ్ ఆడియెన్స్ ను రప్పించే సత్తా ఆ ప్రాడెక్ట్ కు లేనట్టే. ఆకలితో వెళ్లే జనానికి పట్టెడన్నం ఏపాటి?. 'ఏక్ నిరంజన్' నడక కూడా ఇదే బాట పట్టింది. ప్రభాస్, పూరీ కాంబినేషన్ లో 'బుజ్జిగాడు' తర్వాత మళ్లీ 'ఏక్ నిరంజన్' రావడం, సాంగ్స్ మంచి టాక్ తెచ్చుకోవడంతో సహజంగానే ప్రేక్షకులలో అంచనాలున్నాయి. కొద్దికాలంగా ఓ సినిమాకి సరైన ఓపినింగ్స్ లేని డల్ సీజన్ లో మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న హీరో, జనం పల్స్ తెలిసిన దర్శకుడు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమనే అభిప్రాయాలకూ తావిచ్చింది. మరి ప్రేక్షకుడు ఏమేరకు సంతృప్తి చెంది ఉంటాడో చూద్దాం
No comments:
Post a Comment