అడ్వాన్స్ థాట్స్ ఉన్న స్టయిలిష్ డైరెక్టర్ గా అల్లరి రవిబాబు మంచి పేరు తెచ్చుకున్నారు. సపెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించినన 'అనసూయ', లవ్ స్టోరీగా తీసిన 'నచ్చావులే' ఆయనకు వరుస సక్సెస్ లు అందించారు. పబ్లిసిటీకి దూరంగా సినిమాలు తీస్తూ రిలీజ్ కు కొద్దిరోజుల ముందు వినూత్న ప్రచారంతో ఆకట్టుకోవడం ఆయన సక్సెస్ ఫార్ములాగా చెప్పవచ్చు. తాజాగా ఆయన 'అమరావతి' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను ప్రచారార్భాటాలకు దూరంగా తెరకెక్కించారు. ఇంతవరకూ పబ్లిసిటీ స్టిల్స్ కూడా విడుదల చేయని అల్లరి రవిబాబు ఇప్పుడు నేరుగా థియేటర్ ట్రయిలర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సినిమాల రిలీజ్ రోజునే థియేటర్ ట్రైలర్స్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 'ఈనాడు', 'రెచ్చిపో', 'ఏక్ నిరంజన్' ట్రయిలర్స్ కూడా ఈమధ్యన ఇదే తరహాలో రిలీజ్ చేశారు. 'జయీభవ' సినిమాతో 'ఏక్ నిరంజన్' ట్రయిలర్స్ ను రిలీజ్ చేయగా, ఇప్పుడు 'ఏక్ నిరంజన్' సినిమాతో 'అమరావతి' ట్రయిలర్స్ రిలీజ్ చేయనున్నారు.
'అమరావతి' చిత్రంలో భూమిక, స్నేహ, గద్దె సింధూర, తారకరత్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'శౌర్యం' చిత్రాన్ని నిర్మించిన వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ లో సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

No comments:
Post a Comment