స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' షూటింగ్ ను కేరళోని అపెప్పీలో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ విశేషాల్ని నిర్మాత చెబుతూ నవంబర్ 10 వరకు అలెప్పీలో జరిగే షూటింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అద్భుతమైన సబ్జెక్ట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో, ఎంతో లావిష్ గా ఈ చిత్రాన్ని గుశణేఖర్ సూపర్ డూపర్ హిట్ అయ్యేలా రూపొందిస్తున్నారు. మా బ్యానర్ కి ఇది ప్రెస్టీజియస్ ఫిలిం అవుతుందని తెలిపారు. 'వరుడు'గా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ పరిచయం కాబోతోంది. తమిళ హీరో ఆర్య విలన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సుహాసిని, నరేష్ ఆశిష్ విద్యార్ధి, షాయాజీ షిండే, ఆహుతీ ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ, ఫైట్స్ శివ, నిర్మాత డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం గుణశేఖర్.
No comments:
Post a Comment