గోవాలో నాగ్ సందడి

మాస్...బాస్...డాన్...ఇవన్నీ నాగార్జునే. ఈ సినిమాలన్నీనాగార్జునలోని ఫైర్ ను చూపించినవే. 'కింగ్' తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న యువసామ్రాట్ నాగార్జున ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్నేహం విలువను చాటిచెప్పే ఇతివృత్తంతో దర్శకుడు కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ నెలాఖరుకు పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేయనున్నారు. నిర్మాత డి.శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో అక్టోబర్ 10 నుండి షూటింగ్ జరుపుకుంటోందన్నారు. నవంబర్ 4 వరకు జరిగే ఈ షెడ్యూల్ తో చిత్రంలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. తిరిగి నవంబర్ 10 నుండి హైదరాబాద్ లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తామన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే సరికొత్త స్టైల్ లో సాగే ఈ చిత్రం టైటిల్ త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. హీరో నాగార్జున, మోడల్స్ పాల్గొన్న ఓ సాంగ్ ని సెట్ వేసి చిత్రీకరించాం. నాగార్జున, షాయాజీ షిండే, బ్రహ్మానందం పాల్గొన్న కొన్ని సన్నివేశాల్ని తీశాం. డిసెంబర్ లో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రంలో 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో విలన్ గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్నీ, సెల్వ ఫైట్స్ ను, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం కిరణ్ అందించనున్నారు

No comments:

Post a Comment