అనువాద చిత్రాలు మళ్లీ తెలుగులో ఊపందుకుంటున్నాయి. విక్రమ్, సూర్య వంటి పలువురు హీరోల అనువాద చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వైఫల్యాలను చవిచూసినప్పటికీ అనువాద నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో జీవన్ కథానాయకుడుగా మాళవిక, కామ్నజెఠ్మలాని హీరోయిన్లుగా తమిళంలో ఇటీవల విడుదలై విజయవంతమైన 'మచ్చకారన్' చిత్రం ఇప్పుడు 'ధీర' పేరుతో అనువాదమై విడుదలకు సిద్ధమవుతోంది. వాసన్ దర్శకత్వంలో వి.ఐ.పి.ఆర్ట్ మూవీస్ పతాకంపై ఆర్.ఉదయ్ కాంత్, సి.ఎస్.రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
లవ్, యాక్షన్ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదని వారు తెలిపారు. తండ్రీ కొడుకుల మధ్య చోటుచేసుకునే సంఘటనలు హైలైట్ గా నిలుస్తాయనీ, ఈ రెండు పాత్రలనూ జీవన్ పోషించారనీ వారు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఒక స్ట్రయిట్ తెలుగు చిత్రంగా దీనిని అనువదించామని అన్నారు. భాస్కర భట్ల, వనమాలి పాటల రచన చేయగా, తమిళవన్నన్ సంగీతం అందించారనీ, ఈనెల 28న ఆడియో, నవంబర్ 6న సినిమా విడుదల చేస్తున్నామని చెప్పారు.

No comments:
Post a Comment