మాస్ హీరో, సంచలన దర్శకుడు కలిస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు షేక్ అవడం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమైన 'ఏక్ నిరంజన్' భారీ ఓపినింగ్స్ కు సిద్ధమవుతోంది. ఈ గురువారమే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, సోమవారం నుంచి చాలాచోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తెరవడంతో వారాంతం వరకూ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ చిత్రాన్ని తొలిరోజు ప్రసాద్ ఐమాక్స్ లో 15 షోలు, ఐనాక్స్ లో 14 షోలు ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఫోలన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి.
రాష్ట్రంలో సంభవించిన వరదలు, అంతకుముందు ముఖ్యమంత్రి వై.ఎస్. మృత్యువాత పడటంతో చాలా సినిమాలు ఓపినింగ్స్ కు కూడా నోచుకోలేదు. ఈ క్రమంలో 'ఏక్ నిరంజన్'కు భారీ ఓపినింగ్స్ అడ్వాంటేజ్ కాబోతోంది. ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పూరీ జగన్నాథ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే ఆడియో మంచి సక్సెస్ కావడం, థియేటర్ ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ సంచనలం సృష్టించడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. 'నేనింతే' చిత్రం ఫ్లాప్ తో డీలా పడిన పూరీకి, 'బిల్లా'తో ఓ మోస్తరు సక్సెస్ మాత్రమే అందుకున్న ప్రభాస్ కూ 'ఏక్ నిరంజన్' ఫలితం కీలకం కాబోతోంది.

No comments:
Post a Comment