
? 'జయీభవ'కు రెస్పాన్స్ ఎలా ఉంది
- ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాం. నా గత చిత్రాల మాదిరిగా కాకుండా ఇందులో అవసరమైన మేరకే యాక్షన్ ఉంటుంది. రాష్ట్రంలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఫీల్ గుడ్ మూవీ చేశానంటూ అందరూ అభినందిస్తున్నారు.
? 'జయీభవ' ఏ రేంజ్ హిట్
- మా బ్యానర్ నుంచిన వచ్చిన మొదటి రెండు చిత్రాలు హిట్. వాటికంటే వైవిధ్యంగా ఈ సినిమా చేయాలనుకున్నాం. 'అతనొక్కడే' యాక్షన్ ఫిల్మ్. 'హరేరామ్' మరో తరహా యాక్షన్ లో సాగుతుంది. డ్యూయెల్ రోల్ పోషించాను. ఈసారి వినోదాత్మకమైన ఫ్యామిలీ స్టోరీని ఎంచుకుని 'జయీభవ' చేశాం. ఓపెన్సింగ్ బాగున్నాయి. కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇన్ స్టంట్ కిక్ ఇవ్వవు. గ్రాడ్యువల్ గా ప్రేక్షకులకు చేరుతాయి. ఓ ఉద్దేశంతో సినిమా తీశామో దానికి దగ్గరయ్యాం. మంచి రేంజ్ అవుతుంది. యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉంది.
No comments:
Post a Comment