
దర్శకుడు సురేష్ మాట్లాడుతూ, నిఖిల్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే కథతో ఈచిత్రం ఉంటుందనీ, నిఖిల్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందనీ అన్నారు. అభినయానికి ఆస్కారమున్న పాత్రను శ్వేతబసు ప్రసాద్ పోషించిందని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, పూర్తి వాణిజ్య అంశాలతో ప్రేమకథకు మాస్, క్లాస్ అంశాలు జోడించి ఈ చిత్రం తెరకెక్కిందనీ, రాజమండ్రిలోని అందమైన లొకేషన్లలోనూ, హైద్రబాద్ లోనూ షూటింగ్ చేసామనీ చెప్పారు. యువతకు నచ్చే అన్ని ఆంశాలు ఉన్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. నవంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, రఘుబాబ, వేణుమాధవ్, థర్మవరపు, కాశీ విశ్వనాథ్, ప్రగతి, గౌతంరాజు తదితరులు నటించారు. చందు మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ, 'గమ్యం' అనిల్ సంగీతం అందించారు.
No comments:
Post a Comment