'ఏక్ నిరంజన్' ఆఫర్

మాస్ హీరో, సంచలన దర్శకుడు కలిస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు షేక్ అవడం ఖాయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన 'ఏక్ నిరంజన్' భారీ ఓపినింగ్స్ తో విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్, 'ఏక్ నిరంజన్' నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ '350కి పైగా ప్రింట్లతో దాదాపు 700 థియేటర్లలో విడుదలైన 'ఏక్ నిరంజన్'కు అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్' వచ్చింది. 'ఓపెనింగ్స్ డ్రెమండస్ గా ఉన్నాయి', 'ప్రభాస్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్', 'పూరీ జగన్నాథ్ డైరెక్షన్ ఎక్స్ లెంట్', 'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్ ఎక్స్ ట్రార్డనరీ', 'క్లైమాక్స్ ఫైట్ అదిరింది', 'పూరీ డైలాగ్స్ ఫెంటాస్టిక్', 'విలన్ సోనూసూద్ సూపర్', 'సినిమా అండర్ కరెంట్ గా మంచి సెంటిమెంట్ ఫీల్ ఉంది', 'కమర్షియల్ గా చాలా పెద్ద హిట్'... ఇలా అందరూ 'ఏక్ నిరంజన్'ని అప్రిషియేట్ చేస్తుంటే నిర్మాతగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంత మంచి విజయాన్ని సాధించిన 'ఏక్ నిరంజన్' చిత్రాన్ని వీడియో పైరసీ నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. వీడియో ఫైరసీని అరికట్టేందుకు ప్రతి ప్రింట్ మీద సీక్రెట్ కోడ్స్ పెట్టాం. ఎక్కడి నుండి ఏ పైరసీ చేసినా, ఏ ప్రింట్ నుండి ఆ పైరసీ విసిడి వచ్చిందో తెలుకుని తక్షణం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. 'ఏక్ నిరంజన్' పైరసీ విడియో ఎక్కడ దొరికినా మాకు సమాచారం అందించవలసిందిగా ప్రేక్షకుల్ని, ప్రభాస్ అభిమానుల్ని కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అందించి, వీడియో పైరసీని అరికట్టడంలో సహకరించిన వారికి 'ఏక్ నిరంజన్' యూనిట్ తరఫున విలువైన బహుమతిని అందిస్తాం. 'ఏక్ నిరంజన్'ని పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కు, ప్రభాస్ అభిమానులకు, పూరీ జగన్నాథ్ అభిమానులకు బిగ్ థాంక్స్ అని అన్నారు.

No comments:

Post a Comment