
ప్రేమ కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని శ్రీనివాస రాగ తెరకెక్కించారనీ, తమ సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల తరహాలోనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కిందనీ గుణ్ణం గంగరాజు తెలిపారు. టీచర్ పాత్రలో జెనీలియా కీలక భూమిక పోషించిందని చెప్పారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం వినూత్న అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. శ్రీనివాస్ రాగ కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు మాటలు, రవీందర్ ఆర్ట్, ఆండ్రూ సినిమోటోగ్రఫీ, ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందించారు
No comments:
Post a Comment