మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనువడు (సురేష్ బాబు తనయుడు) దగ్గుబాటి రాణా తొలిసారి కథానాయకుడుగా పరిచయం అవుతున్న 'లీడర్' చిత్రం లోగో ఆవిష్కరణ నవంబర్ 1న జరుగుతుంది. ఇంతవరకూ 4 హిట్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ('గోదావరి' చిత్రానికి మాత్రం సమర్పకుడు) శేఖర్ కమ్ముల తొలిసారి బయట బ్యానర్ లో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్ వర్క్ కు రెడీ అవుతోంది.
ఇంతవరకూ సున్నితమైన ప్రేమకథాంశాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల తొలిసారి రాజకీయ నేపథ్యంలో 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. రాణా సరసన ప్రియా ఆనంద్, రిచా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 1న లోగో ఆవిష్కరణ జరిపి, 15వ తేదీన ఏర్పాటు చేసే ఓ భారీ కార్యక్రమంలో రాణాను తొలిసారి ప్రేక్షకులు, మీడియాకు పరిచయం చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియో నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కలసొచ్చేలా డిసెంబర్ 24న 'లీడర్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

No comments:
Post a Comment