
'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రమిదనీ, నేహాశర్మ హీరోయిన్ గా నటించిందనీ ఆయన తెలిపారు. ఈ కథకు 'కుర్రాడు' అనే టైటిల్ హండ్రెడ్ పర్సంట్ యాప్ట్ అవుతుందన్నారు. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్న అచ్చు పాటలన్నీ చాలా అద్భుతంగా చేశారనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో 'బొమ్మాలి' రవి, తనికెళ్ల భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణు, నవీన్ తదితరులు నటిస్తున్నారు. అనంత్ శ్రీరామ్ పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు
No comments:
Post a Comment