హీరో రవితేజ ఈ ఏడాది డబుల్ జాక్ పాట్ కొట్టిన ఉత్సాహంలో ఉన్నారు. గత సమ్మర్ కు విడుదలైన 'కిక్' ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చింది. తాజాగా 2008 సంవత్సరానికి గాను 'నేనింతే' చిత్రానికి తొలిసారి ఉత్తమ నటుడుగా 'నంది' అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఇదే ఊపులో ఉన్న రవితేజ తన తదుపరి చిత్రం 'శంభో శివ శంభో'పై పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నారు. తమిళంలో ఇటీలవ విడుదలై సంచలన విజయం సాధించిన 'నాడోగిగల్' చిత్రానికి ఇది రీమేక్. తమిళ వెర్షన్ కు పనిచేసిన సముద్రఖని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ నటనా సామర్థ్యం, ముఖ్యంగా అతని ఎనర్జీ లెవెల్స్ చూసి ముచ్చటపడిన సముద్ర ఖని నేరుగా తమిళంలో రవితేజతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుగు రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
సముద్ర ఖని ఎంతో వృత్తిపట్ల అంకితభావం ఉన్న ప్రతిభావంతుడైన దర్శకుడనీ, ఆయనతో పనిచేస్తుండటం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోందనీ రవితేజ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను సైతం తమిళంలో ధారాళంగా మాట్లాడగలననీ, 'శంభో శివ శంభో' చిత్రం తర్వాత ఒక యాక్షన్ మూవీ ద్వారా తనను తమిళంలో పరిచయం చేయాలని ప్లానింగ్ చేస్తున్నారనీ చెప్పారు. కోలీవుడ్ లో కూడా తనకు మంచి సపోర్ట్ లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో...రవితేజ త్వరలోనే ద్విభాషా నటుడుగా మారబోతున్నట్టే.

No comments:
Post a Comment