
నేటి యువత మనోభావాలకూ, ప్రస్తుత వస్తవ పరిస్థితులకు దగ్గరగా ఈ చిత్రం ఉంటుందనీ, తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తున్నామనీ దర్శకుడు రాజ్.కె.ఎస్.గోపి తెలిపారు. బ్రహ్మానందం కామెడీ, ప్రీతి జింగానియా స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్స్ అవుతాయని అన్నారు. ఎక్కడా రాజీపడకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కిందని చెప్పారు. ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వస్తున్నట్టు నిర్మాత రాజశేఖర్ తెలిపారు. సెన్సార్ సభ్యుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సర్దార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, దిలీప్, గౌతమ్, జయవర్దన్, ప్రీతి జింగానియా, మోనీషా, దివ్వ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు తారాగణం. గణ సంగీతం అందించారు.
No comments:
Post a Comment