
సిద్దార్ధ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ తెలుగులో అన్నీ ప్రేమకథా చిత్రాలే చేయడం వల్ల తనకు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చిందనీ, అయితే అన్నిరకాల పాత్రలు చేయాలని తనకుండేదనీ ఆయన అన్నారు. అలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చిన కె.రాఘువేంద్రరావుకు తన కృతజ్ఞతలని అన్నారు. ప్రకాష్ తనకు మంచి మిత్రుడే కాకుండా తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చే సత్తా ఉన్నవాడనీ, భారతదేశం గర్వించదగిన నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తనకు జంటగా నటిస్తుండటం మరపురాని అనూభూతినిచ్చిందని అన్నారు. వైవిధ్యమైన కథ, మంచి ఆర్టిస్టులు, చక్కటి సాంకేతిక నిపుణులతో చేస్తున్న ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఒక మంచి టీమ్ తో పనిచేస్తుండటం సంతోషంగా ఉందని శ్రుతి హాసన్ పేర్కొంది. ప్రకాష్ మాట్లాడుతూ, వినూత్నమైన కథ-కథనాలు, ప్రెజంటేషన్ తో గ్రాఫికల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి జె.కె.భారవి-రమేష్ సామల మాటలు, సౌందర్ రాజన్ ఎస్. సినిమాటోగ్రఫీ, భూపేష్ ఆర్ భూపతి కళాదర్శకత్వం, శ్రావణ్ ఎడిటింగ్, మిక్కీ జె.మేయర్ సంగీతం అందించనున్నారు.
No comments:
Post a Comment