మాధవన్, నీతూచంద్ర జంటగా బిగ్ పిక్చర్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన '13 బి' చిత్రం మంచి ప్రేక్షకాదరణ చూరగొంది. ఆ చిత్రాన్ని బిగ్ పిక్చర్స్ సంస్థ 'పదమూడు' పేరుతో తెలుగులోకి అనువదించి నవంబర్ 6న విడుదలకు సిద్ధం చేస్తోంది. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆ విశేషాలను బిగ్ పిక్చర్స్ ప్రతినిధులు, నటుడు రవిబాబు తెలియజేశారు.
రవిబాబు మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను పోలీస్ ఆఫీసర్ గా మేకప్ లేకుండా నటించాననీ, దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రతిభావంతుడనీ చెప్పారు. హారర్, సస్పెన్స్ చిత్రాలు చేసే దర్శకులకు ఈ సినిమా ఓ రిఫరెన్స్ లా ఉపయోగపడుతుందని అన్నారు. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. హిందీ. తమిళ్ భాషల్లో ఈ సినిమా తీశామనీ, ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రాహణం ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పారు. హారర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నమ్మకానికీ, అపనమ్మకానికీ మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రమనీ, తెలుగువారిని అలరించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయనీ పి.సి.శ్రీరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ పిక్చర్స్ ప్రతినిధులు సంజయ్ తామ్రాని, కమల్, చంద్రశేఖర్, రాజశ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శరణ్య, రోహిణి, వసంత్ తదితరులు నటించారు. రాజశ్రీ సుధాకర్ మాటలు-పాటలు, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందించారు.

No comments:
Post a Comment