నితిన్, హన్సిక మోత్వాని జంటగా వెల్ ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ విజయ్ ప్రసాద్ మళ్ల నిర్మిస్తున్న చిత్రం 'సీతారాముల కల్యాణం'. దీనికి 'లంకలో' అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈశ్వర్ దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రైడ్ ఇన్ లో ఆదివారంనాడు జరిగింది. ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్ ఈ లోగోను ఆవిష్కరించారు. సుధారకర్ రెడ్డి, నితిన్, హన్సిక, వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణకుమారి, నటుడు సుమన్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ తదితరులు పాల్గొన్నారు.కెఎస్ రామారావు మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత కృషి-పట్టుదల ఉన్నవాడనీ, 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' సినిమా తీసి ఇప్పుడు మళ్లీ దర్శకుడు ఈశ్వర్ తోనే రెండో సినిమా తీశారనీ, స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. పేరుకు తగ్గట్టే ఇది చక్కటి కుటుంబ కథా చిత్రమనీ, ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్న సినిమా ఇదనీ నితిన్ పేర్కొన్నారు. మంచి టీమ్ తో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని హన్సిక పేర్కొంది. సుమన్ మాట్లాడుతూ, నిర్మాతతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందనీ, ఇందులో తాను ఓ కొత్త గెటప్ లో కనిపించబోతున్నాననీ చెప్పారు. నాడు సీతారాముల కల్యాణం అయోధ్యలో జరిగితే, నేటి సీతారాముల కల్యాణం లంకలో జరుగుతుందనీ, ఆద్యంతం ఆసక్తి కలిగించే ఇలాంటి అంశాలతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు ఈశ్వర్నటిస్తున్నారు. ఈచిత్రానికి విక్రమ్ రాజ్-ముకుంద్ పాండే కథ, తోట ప్రసాద్-విక్రమ్ రాజ్ మాటలు, ఎం.జోషి కెమెరా, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు. తెలిపారు. విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ, జూన్ 11న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభించామనీ, మళ్లీ సెప్టెంబర్ 1న ఆయనను కలిసినప్పుడు సినిమా ఎంతవరకు వచ్చిందని అడిగారనీ, ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు తమకు ఉంటాయనే నమ్మకం ఉందనీ అన్నారు. క్లైమాక్స్, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందనీ, యూరప్ లో వీటిని ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. నవంబర్ 18న ఆడియో, డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సలీంపండా, సుమన్, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, సుబ్బరావు, జీవా, హేమ తదితరులు నటిస్తున్నారు. విక్రమ్ రాజ్ కథ, తోటప్రసాద్-విక్రమ్ రాజ్ మాటలు, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.జోషి సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment