
చిత్ర సమర్పకుడు యు.కె.ఎవెన్యూస్ ఉదయ్ కిరణ్ ఆ విశేషాలను తెలియజేస్తూ, నవంబర్ 9 నుంచి 25 రోజుల పాటు పాండిచ్చేరి, గోవా, చెన్నై పరసర ప్రాంతాల్లో ఉదయ్, శ్వేతబసులపై మూడు పాటలు, చిత్రంలోని ప్రధాన తారలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పారు. డిసెంబర్ లో హైద్రాబాద్ లో జరిపే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ తెలిపారు. ఇదో అందమైన ప్రేమకథా చిత్రమనీ, దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా చక్కగా మలుస్తున్నారనీ నిర్మాతలు తెలిపారు. జనార్థన్ మహర్షి కథ, ప్రదీప్ కోనేరు సంగీతం, రాఘువన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయనీ, ఉదయ్ కిరణ్ కెరీర్ కి ఈ చిత్రం తప్పకుండా బ్రేక్ ఇస్తుందని అన్నారు.
No comments:
Post a Comment