సూర్య, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ తమిళంలో నిర్మించిన 'ఆదవన్' చిత్రాన్ని చందన రమేష్ తెలుగులో 'ఘటికుడు' పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగింది. సూర్య, చందన రమేష్, శానం నాగ అశోక్ కుమార్, చందన నాగేశ్వర్, ఉదయనిధి స్టాలిన్, షణ్ముఖ శాస్త్రి, వి.వి.వినాయక్, కల్యాణి, కుమార్ బాబు, చైతన్య రాజు, కె.ఎస్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వినాయక్ చేతుల మీదుగా ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది.కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నవరసాలు ఉన్నాయనీ, తన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకాదరణ చూరగొన్నాయని అన్నారు. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో సూర్య పదేళ్ల కుర్రాడిగా కనిపిస్తారనీ, నయనతార చక్కట ప్రదర్శించిందనీ చెప్పారు. ప్రముఖ నటి సరోజా దేవి పదేళ్ల తర్వాత ఈ చిత్రంలో నటించడం విశేషమని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వినాయక్ మాట్లాడుతూ, కె.ఎస్.రవికుమార్ అంటే దర్శకులందరికీ ఎంతో గౌరవమనీ, ట్రైలర్స్ చాలా బాగున్నాయనీ, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపిస్తోందని అన్నారు. సూర్య మాట్లాడుతూ, హైద్రాబాద్ ఎప్పుడు వచ్చినా తనకు అపూర్వమైన గౌరవం లభిస్తుంటుందనీ, కె.ఎస్.రవికుమార్ తో పనిచేయడం చాలా సంతోషం కలిగించిందనీ అన్నారు. తాను చదువుకున్న కాలేజీలో స్టాలిన్ తనకు జూనియర్ అని అన్నారు. ఫ్యామిలీ కథాంశంతో రూపొందిన చిత్రమిదనీ, తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాననీ అన్నారు. ఈ చిత్రం తెలుగులో నూరు రోజులు ఆడాలని ఆశిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ చిత్రంతో నిర్మాత కావడం సంతోషంగా ఉందని చందన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సూర్య 5 లక్షలు, చందన రమేష్ 3 లక్షలు ప్రకటించారు.
No comments:
Post a Comment