వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నమో వెంకటేశ'. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. రామానాయుడు స్టూడియోస్ లో గురువారంనాడు ఆ విషయాలను చిత్రయూనిట్ తొలిసారి తెలియజేసింది.తొలుత శ్రీనువైట్ల మాట్లాడుతూ, వెంకటేష్ తో పనిచేయాలని చాలాకాలంగా తనకు కోరిక ఉన్నప్పటికీ ఇప్పటికి ఆ అవకాశం దొరికిందనీ, ఈ చిత్రానికి తన మిత్రులు నిర్మాతలుగా ఉండేందుకు అంగీకరించిన వెంకటేష్ కు కృతజ్ఞతలనీ అన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా స్క్రిప్టు వర్క్ కు ఎక్కువ సమయం పట్టిందన్నారు. దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, అలాగే షూటింగ్ వేగంగా జరగడానికి కెమెరామన్ ప్రసాద్ మూరెళ్ల అనుభవం ఎంతగానో ఉపయోగపడిందనీ అన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష పాత్ర కీలకమనీ, ఇంతవరకూ 85 శాతం షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర పేరు ప్యారిస్ ప్రసాద్ అనీ, సినిమా అంతా తాను కనిపిస్తాననీ, ఇంత పెద్ద క్యారెక్టర్ తానెప్పుడూ చేయలేదనీ బ్రహ్మానందం పేర్కొన్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందనీ, చాలా ఎంజాయ్ చేస్తూ ఆయనతో నటించాననీ చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, శ్రీనువైట్లతో పనిచేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నప్పటికీ ఇప్పటికి కుదిరిందని చెప్పారు. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి', 'కలిసుందాం రా' చిత్రాల తరహాలో ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపారు. ఇందులో తన పాత్రపేరు పర్వతనేని వెంకట రమణ అని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణనీ చెప్పారు. ఇందులో తాను మొదటి హీరోనైతే, బ్రహ్మానందం రెండో హీరో అనీ, 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత త్రిషతో కలిసి నటిస్తున్న రెండో చిత్రమిదని అన్నారు. త్రిష మాట్లాడుతూ, దర్శకుడితోనూ, వెంకటేష్ తోనూ తాను పనిచేస్తున్న రెండో సినిమా ఇదని అన్నారు. చక్కటి ఫ్యామిలీ డ్రామాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని అన్నారు. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ తో సాగే రొమాంటిక్ ఫిల్మ్ ఇదని డి.సురేష్ బాబు అన్నారు. చాలామంది నటులు ఇందులో ఉన్నారనీ, సి సెంటర్స్ నుంచి ఓవర్సీస్ ప్రేక్షకుల వరకూ అన్ని వర్గాలనూ ఈ చిత్రం అలరింస్తుందనీ అన్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.సంక్రాంతికి 'నమో వెంకటేశ'
వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నమో వెంకటేశ'. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. రామానాయుడు స్టూడియోస్ లో గురువారంనాడు ఆ విషయాలను చిత్రయూనిట్ తొలిసారి తెలియజేసింది.తొలుత శ్రీనువైట్ల మాట్లాడుతూ, వెంకటేష్ తో పనిచేయాలని చాలాకాలంగా తనకు కోరిక ఉన్నప్పటికీ ఇప్పటికి ఆ అవకాశం దొరికిందనీ, ఈ చిత్రానికి తన మిత్రులు నిర్మాతలుగా ఉండేందుకు అంగీకరించిన వెంకటేష్ కు కృతజ్ఞతలనీ అన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా స్క్రిప్టు వర్క్ కు ఎక్కువ సమయం పట్టిందన్నారు. దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, అలాగే షూటింగ్ వేగంగా జరగడానికి కెమెరామన్ ప్రసాద్ మూరెళ్ల అనుభవం ఎంతగానో ఉపయోగపడిందనీ అన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష పాత్ర కీలకమనీ, ఇంతవరకూ 85 శాతం షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర పేరు ప్యారిస్ ప్రసాద్ అనీ, సినిమా అంతా తాను కనిపిస్తాననీ, ఇంత పెద్ద క్యారెక్టర్ తానెప్పుడూ చేయలేదనీ బ్రహ్మానందం పేర్కొన్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందనీ, చాలా ఎంజాయ్ చేస్తూ ఆయనతో నటించాననీ చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, శ్రీనువైట్లతో పనిచేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నప్పటికీ ఇప్పటికి కుదిరిందని చెప్పారు. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి', 'కలిసుందాం రా' చిత్రాల తరహాలో ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపారు. ఇందులో తన పాత్రపేరు పర్వతనేని వెంకట రమణ అని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణనీ చెప్పారు. ఇందులో తాను మొదటి హీరోనైతే, బ్రహ్మానందం రెండో హీరో అనీ, 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' తర్వాత త్రిషతో కలిసి నటిస్తున్న రెండో చిత్రమిదని అన్నారు. త్రిష మాట్లాడుతూ, దర్శకుడితోనూ, వెంకటేష్ తోనూ తాను పనిచేస్తున్న రెండో సినిమా ఇదని అన్నారు. చక్కటి ఫ్యామిలీ డ్రామాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని అన్నారు. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ తో సాగే రొమాంటిక్ ఫిల్మ్ ఇదని డి.సురేష్ బాబు అన్నారు. చాలామంది నటులు ఇందులో ఉన్నారనీ, సి సెంటర్స్ నుంచి ఓవర్సీస్ ప్రేక్షకుల వరకూ అన్ని వర్గాలనూ ఈ చిత్రం అలరింస్తుందనీ అన్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment