'టామ్ అండ్ జెర్రీ' జంట

'దేవదాసు' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'జగడం'తో మాస్ ఇమేజ్ తెచ్చుకు్న రామ్ 'రెడీ' చిత్రంతో చిన్న పిల్లలకు కూడా చేరువయ్యారు. ఆ చిత్రం సాధించిన విజయంతో 32 మంది పిల్లలతో ఇటీవలే 'గణేష్ ' చిత్రంతో రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఫ్యామిలీస్, కిడ్స్ ను ఆకట్టుకునేందుకు రామ్ మరో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆయన మరోసారి శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నటించనున్న కొత్త చిత్రానికి 'టామ్ అండ్ జెర్రీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
రామ్-సురేందర్ రెడ్డి కలిసి పనిచేయబోతున్న తొలి చిత్రమిదే. 'కిక్' చిత్రం హిట్ తో మంచి ఊపులో ఉన్న సురేందర్ రెడ్డి ఆ చిత్ర కథానాయిక ఇలాయానాను మరోసారి తన తాజా చిత్రానికి కూడా రామ్ సరసన కథానాయికగా ఎంపిక చేశారు. 'దేవదాసు' చిత్రంలో తొలిసారి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ జంట మూడేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనుండటం విశేషం. రామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న 'రామరామ కృష్ణకృష్ణ' చిత్రంలో నటిస్తుండగా, వైవిఎస్ చౌదరి 'సలీమ్' చిత్రంలో ఇలియానా నటిస్తోంది. వీరిద్దరి తదుపరి చిత్రం 'టామ్ అండ్ జెర్రీ'నే. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. స్రవంతి రవికిషోర్ నిర్మాత

No comments:

Post a Comment