రవితేజకు శత్రువులెవరు?

మాస్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఈమధ్యనే రివాలర్స్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకోవడం ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఆయనకు వ్యక్తిగతంగా శత్రువులలెవరూ లేనప్పటికీ పరిశ్రమలో మునుముందు ఏమైనా చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసు అధికారులను సైతం ఆలోచించజేస్తోందని చెబుతున్నారు
పరిశ్రమకు చెందిన పలువురు సొంత (లైసెన్స్ డ్) రివాల్వర్ ఉండటం ఫ్యాషన్ గానో, రాయల్ గానో చాలామంది భావిస్తుంటారనీ, రవితేజకు శత్రువులు ఎవరూ లేనందున ఆయనకు రివాల్వర్ అవసరం లేదని కొందరి వాదన. పరిశ్రమకు చెందిన వారెవరూ లైసెన్స్ డ్ రివాల్వర్ ను దుర్వినియోగం చేసిన దాఖలాలు గతంలో లేకపోవడం వల్ల చాలా ఏళ్లుగా పోలీసులు లైసెన్స్ లు మంజూరు చేసేవారు. అయితే బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం తర్వాత మాత్రం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రివాల్వర్ లైసెన్స్ లు ఇచ్చేముందు పోలీసులు ఇకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. రవితేజ విషయానికి వస్తే ఆయన సైతం రివాల్వర్ ను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉండకపోవచ్చనీ, అయితే ఆయన సోదరుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండటాన్ని కూడా పోలీసు అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోనున్నారనీ తెలుస్తోంది

No comments:

Post a Comment