కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమా తీస్తున్నారంటే ఆ ఏడాది నందులన్నీ (నంది అవార్డులు) ఆయన ఇంటికి క్యూలు కట్టేస్తాయని పరిశ్రమలో బలంగా నమ్మేవారు. 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం' వంటి ఎన్నో చిత్రాలు అలా నందుల పంట పండించినవే. 2004లో 'స్వరాభిషేకం' చిత్రం తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ విశ్వనాథ్ మెగా ఫోన్ అందుకోబోతున్నారు. కౌసలేంద్రరావు నిర్మించనున్న ఈ చిత్రానికి 'సుమధురం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయి పాటల రికార్డింగ్ జరుగుతోంది. అల్లరి నరేష్ కథానాయకుడుగా ఎంపికైన ఈ చిత్రంలో హీరోయిన్ కోసం కొద్దిరోజులుగా జరుపుతున్న అన్వేషణ ముగిసిందనీ, నటి పద్మప్రియ ఈ సువర్ణావకాశం చేజిక్కించుకుందనీ తెలుస్తోంది.పద్మప్రియ ఆరేళ్ల క్రితం ఆర్.పి.పట్నాయక్ నటించిన 'శీను వాసంతి లక్ష్మి' చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత మలయాళ, తమిళ పరిశ్రమల్లో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం హిందీలో సిద్దార్ధకు జోడిగా 'స్ట్రైకర్' అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ చంద్రసిద్దార్ధ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న 'అందరి బంధువయా' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పద్మప్రియ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ కూడా. 200కు పైగా ప్రోగ్రామ్ లు ఇచ్చారామె. ఆమె ప్రొఫైల్ నచ్చడంతో విశ్వనాథ్ ఆమెను కథానాయికగా ఎంపిక చేసిట్టు తెలుస్తోంది. తొలుత శ్రుతి హాసన్ (కమల్ కుమార్త్), సోనమ్ కపూర్ (అనిల్ కపూర్ కుమార్తె) పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ పద్మప్రియ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ అన్వేషణ పూర్తయిందట. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి రానుందివిశ్వనాథ్ హీరోయిన్...
కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమా తీస్తున్నారంటే ఆ ఏడాది నందులన్నీ (నంది అవార్డులు) ఆయన ఇంటికి క్యూలు కట్టేస్తాయని పరిశ్రమలో బలంగా నమ్మేవారు. 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం' వంటి ఎన్నో చిత్రాలు అలా నందుల పంట పండించినవే. 2004లో 'స్వరాభిషేకం' చిత్రం తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ విశ్వనాథ్ మెగా ఫోన్ అందుకోబోతున్నారు. కౌసలేంద్రరావు నిర్మించనున్న ఈ చిత్రానికి 'సుమధురం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయి పాటల రికార్డింగ్ జరుగుతోంది. అల్లరి నరేష్ కథానాయకుడుగా ఎంపికైన ఈ చిత్రంలో హీరోయిన్ కోసం కొద్దిరోజులుగా జరుపుతున్న అన్వేషణ ముగిసిందనీ, నటి పద్మప్రియ ఈ సువర్ణావకాశం చేజిక్కించుకుందనీ తెలుస్తోంది.పద్మప్రియ ఆరేళ్ల క్రితం ఆర్.పి.పట్నాయక్ నటించిన 'శీను వాసంతి లక్ష్మి' చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత మలయాళ, తమిళ పరిశ్రమల్లో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం హిందీలో సిద్దార్ధకు జోడిగా 'స్ట్రైకర్' అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ చంద్రసిద్దార్ధ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న 'అందరి బంధువయా' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పద్మప్రియ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ కూడా. 200కు పైగా ప్రోగ్రామ్ లు ఇచ్చారామె. ఆమె ప్రొఫైల్ నచ్చడంతో విశ్వనాథ్ ఆమెను కథానాయికగా ఎంపిక చేసిట్టు తెలుస్తోంది. తొలుత శ్రుతి హాసన్ (కమల్ కుమార్త్), సోనమ్ కపూర్ (అనిల్ కపూర్ కుమార్తె) పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ పద్మప్రియ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ అన్వేషణ పూర్తయిందట. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి రానుంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment