ఎన్టీర్-నయనతార-షీల ప్రధాన పాత్రల్లో కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవీ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అదుర్స్'. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో షూటింగ్ ప్రోగ్రస్ లో ఉంది. షూటింగ్ స్పాట్ లోనే ఆదివారం సాయంత్రం ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, వినాయక్, నయనతార, కొడాలి నాని, వల్లభనేని వంశీ, బ్రహ్మానందం, నల్లమలుపు బుజ్జి, ఎడిటర్ గౌతంరాజు తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్-వివి వినాయక్ సంయుక్తంగా లోగోను ఆవిష్కరించారుఎన్టీఆర్ మాట్లాడుతూ, దర్శకుడు వినాయక్ తో ఇది తన మూడో చిత్రమనీ, తప్పనిసరిగా హ్యాటిక్ హిట్ అవుతుందనీ చెప్పారు. టైటిల్ ను తాము అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ అదుర్స్ టైటిల్ కు మీడియా విస్తృతంగా ప్రచారం చేసిందనీ, ఎట్టకేలకు అదే టైటిల్ ను ఖరారు చేశామనీ చెప్పారు. తమ కాంబినేషన్ లో వచ్చిన 'ఆది' ఫ్యాక్షన్ చిత్రమైతే, ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో 'సాంబ' వచ్చిందనీ, 'అదుర్స్' పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనీ తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలవుతుందని అన్నారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ చిత్రం మంచి బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉందన్నారు. వినాయక్ మాట్లాడుతూ, ఈ సినిమాకి అదుర్స్ అనే టైటిల్ అనుకోలేదనీ, మీడియా మంచి పబ్లిసిటీ ఇవ్వడం, అభిమానులకు కూడా నచ్చడంతో అదే టైటిల్ ఖరారు చేశామని అన్నారు. ఈ సినిమా కోసం మూడు సబ్జెక్ట్ లు రెడీ చేసి ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్ కావడంతో దీనిని ఎంచుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారనీ, చాలా గ్లామరస్ గా కనిపిస్తారనీ చెప్పారు. సినిమాలో ఊహించని ట్విస్ట్ ఉందన్నారు. అలగే దేవీశ్రీప్రసాద్ చక్కటి సంగీతం అందించారని చెప్పారు. ఈ చిత్రాన్ని తాను సమర్పకుడననీ, తన మిత్రుడు వల్లభనేని వంశీ నిర్మాత అనీ కొడాలి నాని చెప్పారు. ఈ చిత్రం పూర్తి బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్నారనీ, అలాగే ప్రొడక్షన్ లో నల్లపునేని బుజ్జి ఎంతో సహకరించారనీ కొడాలి నాని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ముకుల్ దేవ్, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. కోనవెంకట్ కధ-మాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
No comments:
Post a Comment