సుమన్ శెట్టి వివాహం

పొట్టివాడైనా గట్టివాడుగా కమెడియన్లలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమన్ శెట్టి. 'నిజం', 'పెళ్లాం ఊరెళితే', '7/జి బృందావన్ కాలనీ', 'బెండు అప్పారావు ఆర్ఎంపి' వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సుమన్ శెట్టి ఓ ఇంటివాడు కూడా కాబోతున్నారు.ఈనెల 19న ఆయన వివాహం నాగభవాని (లాస్య)తో జరుగనుంది.
విశాఖపట్నంలోనే దసపల్లా హోటల్ లో తులాలగ్న మందు (తెల్లవారితే శుక్రవారం) ఉదయం 5.38 గంటలకు ముహూర్తం నిశ్చయమైంది. వావాహానంతరం 23వ తేదీన హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో రెసెప్షన్ ఇవ్వబోతున్నారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

No comments:

Post a Comment