పద్మశ్రీ కమల్ హాసన్ 'ఈనాడు' (ఉన్నైపోల్ ఒరువన్) చిత్రం తర్వాత ఏ సినిమాలో నటించబోతున్నారనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. అయితే బుద్ధుని దంతానికి సంబంధించిన చారిత్రక కథాంశంతో మిస్కిన్ దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం ఉండబోతోందనే బలమైన ప్రచారం మాత్రం జరుగుతోంది. అధికారికంగా మాత్రం ఇంకా కమల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ బాలుమహేంద్ర దర్శకత్వంలో కమల్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.బాలుమహంద్ర వద్ద కమల్ ను విశేషంగా ఆకట్టుకునే ఓ స్క్రిప్టు రెడీగా ఉందనీ, సరైన సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారనీ చెన్నై వర్గాలు చెబుతున్నారు. బాలుమహేంద్ర, కమల్ మధ్య చక్కటి అనుబంధం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. వీరురువురూ కలిసి పనిచేసిన 'మూండ్రం పిరై' (వసంత కోకిల), 'సతీ లీలావతి' చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరురువురూ కలిసి పనిచేసే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే మిస్కిన్ చిత్రం తర్వాత ఈ సినిమా ఉంటుందా, ముందుగానే ఈ కాంబినేషన్ చిత్రం వర్కవుట్ అవుతుందా అనేది వేచిచూడాల్సి ఉంది.
No comments:
Post a Comment