ఆర్తి చైన్ స్మోకరా?!

'నువ్వు నాకు నచ్చావ్' తో తొలిసారి తెలుగు తెరపై తళుక్కుమని మెరిసిన ఆర్తి అగర్వాల్ అప్పట్లో కుర్రకారు ఫ్యాన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్రహీరోలతో పాటు తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి కుర్రహీరోలతోనూ నటించింది. ఓ యాక్సిడెంట్ తర్వాత ఆమె బొద్దుగా మారడం...అవకాశాలు కూడా తగ్గడంతో వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ఇటీవలే ఆర్తి తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్ లో టాప్ హీరోలందరితోనూ నటించిన ఆర్తి ఇప్పుడు బి,సి గ్రేడ్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం ఆమె అభిమానులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ ఇన్నింగ్స్ లో కొద్దిగా స్లిమ్ అయినట్టు కనిపిస్తున్నా కొత్తగా ఆమె చైన్ స్మోకింగ్ చేసేస్తోందనే ప్రచారం జరుగుతోంది.హైద్రాబాద్ లోని ఓ పోష్ ఫ్లాట్ లో ఆర్తి తన తండ్రితో కలిసి ఉంటోంది. ఆయనతో కలిసే ఆర్తి స్మోకింగ్ చేస్తుండటం చుట్టుపక్కల వాళ్ల దృష్టిని ఆకర్షిస్తోందట. ఫ్యామిలీ పాత్రల ఇమేజ్ ఉన్న ఆర్తిని ఇలా చూడటం గురించి కొందరు వింతగా చర్చించుకుంటున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆర్తికి ఇలాంటి పోష్ కల్చర్ వింత కాకపోవచ్చనీ, అయితే స్క్రీన్ ఇమేజ్ అనేది కూడా ఒకటి ఉంటుందని ఆర్తి గ్రహించడం ఆమె కెరీర్ కు మంచిదని కొందరు హితోక్తులు పలుకుతున్నారు. ఆర్తి ప్రస్తుతం పోసాని కృష్ణమురళితో 'జెంటిల్ మన్', లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నీలవేణి'లోనూ నటిస్తోంది. ధర్మవరపు సుబ్రమణ్యం హీరోగా పనిచేస్తున్న సినిమాలోనూ ఆర్తి పేరు అప్పట్లో అనౌన్స్ చేశారు.

No comments:

Post a Comment