యాడ్ ల్యాబ్ యుఎస్ కు 'కథ'

జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'అమ్మ చెప్పింది' వంటి విలక్షణ చిత్రాలను అందించిన గుణ్ణం గంగరాజు తాజా చిత్రం 'కథ'. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం యు.ఎస్. రైట్స్ ను యాడ్ ల్యాబ్స్ ఫిల్మ్స్ యుఎస్ఎ దక్కించుకుంది.
ఒక హిల్ స్టేషన్ లో చోటుచేసుకునే సంఘటనల సమాహారమే 'కథ' ఇతివృత్తం. అరకులోయలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపారు. అరుణ్ (తొలిపరిచయం), ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి కీలక పాత్రలు పోషించారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు సంభాషణలు అందించారు. ప్రధానంగా ఇది థ్రిల్లర్ చిత్రమైనప్పటికీ లవ్ అనే అంశం అంతర్లీనంగా ఉంటుందనీ, జెనీలియాకు ఇది పూర్తి వైవిధ్యమైన చిత్రమవుతుందనీ గుణ్ణం గంగరాజు తెలిపారు. చక్కటి స్క్రిప్టుతో తనకు ఇదొక వైవిధ్యమైన చిత్రమమవుతుందనీ, ఇందులో ఒక టీచర్ పాత్రను తాను పోషిస్తున్నాననీ జెనీలియా తెలిపారు. జస్ట్ ఎల్లో వంటి పేరున్న బ్యానర్ లో పనిచేసే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా సినిమా తెరకెక్కిందనీ దర్శకుడు శ్రీనివాస్ రాగ తెలిపారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో జర్నలిజం గ్యాడ్యుయేట్ అయిన తాను హిందీ 'హ్యాపీడేస్' చిత్రంలో నటిస్తున్నాననీ, 'కథ' చిత్రంలో స్టోరీ రైటర్ గా తన పాత్ర ఉంటుందనీ నటుడు అరుణ్ తెలిపారు. గుణ్ణం గంగరాజు నిర్మించిన 4 టీవీ సీరియల్స్ కు తాను పనిచేసినట్టు సంగీత దర్శకుడు ఎస్.కె.బాలచంద్రన్ చెప్పారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయనీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి స్కోప్ ఉందనీ ఆయన తెలిపారు. ఈ చిత్రం యుఎస్ ప్రదర్శన హక్కులు తమకు ఇచ్చిన నిర్మాత గుణ్ణం గంగరాజుతో పాటు చంద్రశేఖర్ ఏలేటి, చెరి లకు యాడ్ ల్యాబ్స్ యుఎస్ఎ ఇన్ కార్పొరేషన్ కు చెందిన రామన్ సంచుల కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment