'కుర్రాడు' అలరిస్తాడు: వరుణ్

'కుర్రాడు' చిత్రంలోని తన పాత్ర ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు వరుణ్ సందేష్ వెల్లడించారు. మాస్ తరహా పాత్రను ఇందులో పోషించానని చెప్పారు. వరుణ్ సందేష్, నేహాశర్మ ('చిరుత ' ఫేమ్) జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ గుణ్ణం తొలిసారి దర్శకత్వం వహించారు. తమళంలో ధనుష్ కథానాయకుడుగా విజయవంతమైన 'పొల్లాదవన్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లోని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కార్యాలయంలో వరుణ్ సందేష్ ముచ్చటించారు. ఆ వివరాల్లోకి వెళితే...? 'కుర్రాడు' కాన్సెప్ట్...- ఇందులో నేను ఓ లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా నటించాను. యూత్ ఫుల్ గా, స్పీడ్ గా ఉంటే ఈ కుర్రాడికి పెద్ద ఆశలంటూ ఏమీ ఉండవు. అయితే బైక్ కొనుక్కుని ప్రేమించిన అమ్మాయిని ఆ బైక్ పై ఎక్కించుకోవాలనే కోరిక ఉంటుంది. బైక్, ఉద్యోగం, కోరుకున్న అమ్మాయి ఇవన్నీ సాధిస్తాడు. అయితే ఒకరోజు అవన్నీ చేజారిపోతాయి. తిరిగి వాటిని ఎలా సంపాదించుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. భావోద్వాగాలు, మాస్ ఎలిమెంట్లు నా పాత్రలో ఉంటాయి.?'పొల్లాదవన్'కు మార్పులు చేశారా- నేటివిటీ అనేది ప్రధానం కాబట్టి తెలుగు నేటివిటికీ దగ్గరగా దర్శకుడు పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఆలీ కామెడీ ట్రాక్ ఇందులో చేర్చారు. బ్యాంకులో అప్పు తీసుకుని వాళ్లకి టోకరా ఇస్తాడు. మారువేషాలతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఈ ట్రాక్ ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుంది.

No comments:

Post a Comment