సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటగా రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో రూపొందిన 'కుర్బాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా హీరో సైఫ్ అలీఖాన్, వివేక్ ఒబెరాయ్, రెన్సిల్ డిసిల్వా హైద్రాబాద్ కు వచ్చారు. సోమవారంనాడు పివిఆర్ సినిమా కాంప్లెక్ లో పాత్రికేయులతో వారు ముచ్చటించారుఉగ్రవాద నేపత్యంలో సాగే ప్రేమకథా చిత్రమిదనీ, ఈనెల 20న ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీలో ప్రీమియర్ షో ఏర్పాటు చేశామని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఇందులో ఢిల్లీ కాలేజీలోని ఓ ప్రొఫెసర్ పాత్రను తాను పోషిస్తున్నాననీ, కరీనాకపూర్ కథానాయికగా నటిస్తోందనీ చెప్పారు. ఈ చిత్రంలో తానొక మంచి పాత్ర పోషించానని వివేక్ ఒబెరాయ్ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ తెలుగులో తీస్తున్న 'రక్తచరిత్ర'లో కూడా తాను నటిస్తన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 'అమ్మా లేదు నాన్నా లేడు' (ఏక్ నిరంజన్) 'బంగారు కోడిపెట్ట' (మగధీర) పాటలు పాడి ఉత్సాహంగా స్పెప్ లు వేస్తూ అందర్నీ ఆయన అలరించారు
No comments:
Post a Comment