ఏ సినిమాకైనా టైటిల్ ప్రాణం. టైటిల్ ఆకర్షణీయంగా ఉంటే ప్రేక్షకులు ఆటోమాటిక్ గా థియేటర్ వైపు కదులుతారు. ఇటీవల కాలంలో ఫిల్మ్ మేకర్స్ సైతం టిటైల్ లేకుండానే సినిమా స్టార్ట్ చేసి ఆనక రెండు మూడు టైటిల్స్ జనాల్లోకి లీక్ చేసి...జనాల్లో బాగా రిజిస్టర్ అయిన పేరునే చివరకు అనౌన్స్ చేస్తున్నారు. ఇందువల్ల టైటిల్ ఎంపిక చేసే శ్రమ ఇటు దర్శకనిర్మాతలకు తప్పడమే గాకుండా, టైటిల్ బాగోలేదంటూ ప్రేక్షకులు పెదవి విరిచేందుకు కూడా ఆస్కారం ఉండదు. ఎన్టీఆర్ 'అదుర్స్'కూ, అల్లు అర్జున్ 'ఆర్య-2'కు కూడా ప్రేక్షకులే టైటిల్ డిసైడ్ చేశారు. అయితే టైటిల్ ఎంపిక చేయడంతో పాటు ప్రేక్షకులకు చేరువచేయడం కూడా ఫిల్మ్ మేకర్స్ కు తప్పనిసరి. తాజాగా 'విలేజ్ లో వినాయకుడు' నిర్మాతలు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. టైటిల్ ప్రేక్షకుల్లో సరిగా రిజిస్టర్ కాకపోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాతలు తాజాగా టైటిల్ లోగోను మార్చి కొత్త పోస్టర్లు, మెటీరియల్ బయటకు తెచ్చారు.కృష్ణుడు కథానాయకుడుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన 'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా ఇదే కాంబినేషన్ లో 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టైటిల్ లో పెద్ద అక్షరాలతో 'వినాయకుడు' కనిపిస్తూ దానికి ముందు 'విలేజ్' అనేది చిన్న అక్షరాలతో...అది కూడా ఆంగ్లంలో డిజైన్ చేశారు. దీంతో బి,సి సెంటర్లలో కొద్దిపాటి అయోమయం నెలకొందట. 'వినాయకుడు' చిత్రాన్నే రీ-రిలీజ్ చేసి ఉంటారనే అపోహలకూ దారితీసిందట. దీంతో ఊహించని ఓపినింగ్స్ ను సైతం రాబట్టుకోలేదని తెలుస్తోంది. ఆ పరిణామాలను నిశితంగా గమనించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పూర్తిగా తెలుగు అక్షరాలతో ఉండే 'విలేజ్ లో వినాయకుడు' టైటిల్ ముద్రించి కొత్త పబ్లిసిటీ మెటీరియల్ బయటకు తెచ్చారు. మునుముందు సీక్వెల్స్ తీసే నిర్మాతలు సైతం టైటిల్ 'మిక్స్ డ్ బ్రీడ్' కాకుండా చూసుకుంటే మంచిదేమో?!'విలేజ్' మారిన వినాయకుడు
ఏ సినిమాకైనా టైటిల్ ప్రాణం. టైటిల్ ఆకర్షణీయంగా ఉంటే ప్రేక్షకులు ఆటోమాటిక్ గా థియేటర్ వైపు కదులుతారు. ఇటీవల కాలంలో ఫిల్మ్ మేకర్స్ సైతం టిటైల్ లేకుండానే సినిమా స్టార్ట్ చేసి ఆనక రెండు మూడు టైటిల్స్ జనాల్లోకి లీక్ చేసి...జనాల్లో బాగా రిజిస్టర్ అయిన పేరునే చివరకు అనౌన్స్ చేస్తున్నారు. ఇందువల్ల టైటిల్ ఎంపిక చేసే శ్రమ ఇటు దర్శకనిర్మాతలకు తప్పడమే గాకుండా, టైటిల్ బాగోలేదంటూ ప్రేక్షకులు పెదవి విరిచేందుకు కూడా ఆస్కారం ఉండదు. ఎన్టీఆర్ 'అదుర్స్'కూ, అల్లు అర్జున్ 'ఆర్య-2'కు కూడా ప్రేక్షకులే టైటిల్ డిసైడ్ చేశారు. అయితే టైటిల్ ఎంపిక చేయడంతో పాటు ప్రేక్షకులకు చేరువచేయడం కూడా ఫిల్మ్ మేకర్స్ కు తప్పనిసరి. తాజాగా 'విలేజ్ లో వినాయకుడు' నిర్మాతలు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. టైటిల్ ప్రేక్షకుల్లో సరిగా రిజిస్టర్ కాకపోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాతలు తాజాగా టైటిల్ లోగోను మార్చి కొత్త పోస్టర్లు, మెటీరియల్ బయటకు తెచ్చారు.కృష్ణుడు కథానాయకుడుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన 'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా ఇదే కాంబినేషన్ లో 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టైటిల్ లో పెద్ద అక్షరాలతో 'వినాయకుడు' కనిపిస్తూ దానికి ముందు 'విలేజ్' అనేది చిన్న అక్షరాలతో...అది కూడా ఆంగ్లంలో డిజైన్ చేశారు. దీంతో బి,సి సెంటర్లలో కొద్దిపాటి అయోమయం నెలకొందట. 'వినాయకుడు' చిత్రాన్నే రీ-రిలీజ్ చేసి ఉంటారనే అపోహలకూ దారితీసిందట. దీంతో ఊహించని ఓపినింగ్స్ ను సైతం రాబట్టుకోలేదని తెలుస్తోంది. ఆ పరిణామాలను నిశితంగా గమనించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పూర్తిగా తెలుగు అక్షరాలతో ఉండే 'విలేజ్ లో వినాయకుడు' టైటిల్ ముద్రించి కొత్త పబ్లిసిటీ మెటీరియల్ బయటకు తెచ్చారు. మునుముందు సీక్వెల్స్ తీసే నిర్మాతలు సైతం టైటిల్ 'మిక్స్ డ్ బ్రీడ్' కాకుండా చూసుకుంటే మంచిదేమో?!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment