'జగద్గురు బాబా' ప్రివ్యూ

షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించిన కొత్త అంశాలను స్పృశిస్తూ 'శ్రీ షిర్డీ సాయిబాబా' చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయమని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసించారు. బి.వి.రెడ్డి టైటిల్ పాత్ర పోషిస్తూ సొంతంగా నిర్మించిన చిత్రమిది. గూడ రామకృష్ణ దర్శకుడు. ఈనెల 19న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్ లో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రివ్యూను మాజీ మంత్రులు కె.జానారెడ్డి, జె.సి.దివాకర్ రెడ్డి తదితరులు తిలకించారు
జానరెడ్డి స్పందిస్తూ, చాలాకాలం తర్వాత తాను చూసిన ప్రివ్యూ ఇదనీ, ప్రేమ-మానవత పెంపొదించుకోవాలని ఈ చిత్రం ప్రబోధిస్తుందనీ, సర్వజనాన్ని ప్రేమింజే షిర్డీ సాయిబాబా జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనీ అన్నారు. సాయిబాబా పాత్రను బి.వి.రెడ్డి అత్యద్భుతంగా పోషించారని ప్రశంసించారు. మరో మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, బాలగంగాధర తిలక్, సాయిబాబా మధ్యగల అనుబంధం ఇంతవరకూ ఏ చిత్రంలోనూ రాలేదనీ, ఈ అంశాన్ని ఇందులో ఆవిష్కరించారనీ చెప్పారు. ఇలాంటి ఎన్నో కొత్త అంశాలను పరిశోధించి ఈ సినిమా తీయడం అభినందనీయమని అన్నారు. సాయిబాబా పాత్రకు బి.వి.రెడ్డి చక్కటి న్యాయం చేశారని కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేష్ ప్రసంసించారు. బి.వి.రెడ్డి మాట్లాడుతూ, అధ్యాత్మిక అంశాలనే కాకుండా కులమత రహిత సమాజ స్థాపనకు సాయిబాబా చేసిన కృషి ఇందులో చూపించామని అన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని మలిచామనీ, ఇందులో ఏడు పాటలు ఉంటాయని దర్శకుడు తెలిపారు. నానావళి పాత్రధారి శివకృష్ణ, తాత్యా పాత్రధారి సత్యారెడ్డి, నిర్మాత నట్టికుమార్ తదితరులు ఈ ప్రివ్యూ తిలకించారు.

No comments:

Post a Comment