మీరాజాస్మిన్ కథానాయికగా శ్రీ జగదీశ్వరి ఫిలింస్ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి శ్రీకారం చుట్టుంది. రాంబాబు నిర్మాత. కె.రాఘువేంద్రరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వాసుదేవ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో బుధవారంనాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.మీరాజాస్మిన్ కెరీర్ లో వైవిధ్యభరితమైన చిత్రంగా ఇది ఉంటుందనీ, కమర్షియల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నామనీ దర్శకనిర్మాతలు తెలిపారు. జనవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామన్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు
No comments:
Post a Comment