జగపతిబాబు, ప్రియమణి జంటగా టాలీ2హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రం 'ప్రవరాఖ్యుడు'. మదన్ దర్శకుడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని తాజ్ బంజారాలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఆడియో సీడీని ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేసి తొలి ప్రతిని దిల్ రాజుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను శ్రీనువైట్ల విడుదల చేసి కీరవాణికి అందించారు. మదన్, గణేష్ ఇందుకూరి, జగపతిబాబు, ప్రియమణి, బ్రహ్మానందం, ఆలీ, చలపతిరావు, వరుణ్ సందేష్, సునీత తదితరులు హాజరయ్యారు.రాజమౌళి మాట్లాడుతూ, 'పెళ్లయిన కొత్తలో' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీని తీసిన మదన్ మరోసారి చేస్తున్న ఈ ప్రేమకథా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాతలు మంచి అభిరుచి ఉన్న వారనీ, మదన్ మంచి టీమ్ ను ఎన్నుకుని తీసిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాననీ దిల్ రాజు అన్నారు. తాను మొదటిసారి కథ చెప్పిన హీరో జగపతిబాబు అయితే, తన ఫేవరెట్ సంగీత దర్శకుడు కీరవాణి అనీ, ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని శ్రీనువైట్ల పేర్కొన్నారు. దర్శకుడు మదన్ చాలా బాగా సినిమా తెరకెక్కించారనీ, అలాగే జగపతిబాబు, ప్రియమణి సక్సెస్ ఫుల్ జంట అనీ, తానెంతో ఇష్టపడే సంగీత దర్శకుడు కీరవాణి అని బ్రహ్మానందం అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రేమకథలు ఎప్పుడూ ఫెయిల్ కావని కీరవాణి అన్నారు. నాటి దేవదాసు నుంచి మరో చరిత్ర, కొత్తబంగారులోకం వరకూ ప్రేమకథలు అలరిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రేమకు కొత్త నిర్వచనాన్ని మదన్ ఈ చిత్రంలో చెప్పారని తెలిపారు'ప్రవరాఖ్యుడు' పాటలు
జగపతిబాబు, ప్రియమణి జంటగా టాలీ2హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రం 'ప్రవరాఖ్యుడు'. మదన్ దర్శకుడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని తాజ్ బంజారాలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఆడియో సీడీని ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేసి తొలి ప్రతిని దిల్ రాజుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను శ్రీనువైట్ల విడుదల చేసి కీరవాణికి అందించారు. మదన్, గణేష్ ఇందుకూరి, జగపతిబాబు, ప్రియమణి, బ్రహ్మానందం, ఆలీ, చలపతిరావు, వరుణ్ సందేష్, సునీత తదితరులు హాజరయ్యారు.రాజమౌళి మాట్లాడుతూ, 'పెళ్లయిన కొత్తలో' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీని తీసిన మదన్ మరోసారి చేస్తున్న ఈ ప్రేమకథా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాతలు మంచి అభిరుచి ఉన్న వారనీ, మదన్ మంచి టీమ్ ను ఎన్నుకుని తీసిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాననీ దిల్ రాజు అన్నారు. తాను మొదటిసారి కథ చెప్పిన హీరో జగపతిబాబు అయితే, తన ఫేవరెట్ సంగీత దర్శకుడు కీరవాణి అనీ, ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని శ్రీనువైట్ల పేర్కొన్నారు. దర్శకుడు మదన్ చాలా బాగా సినిమా తెరకెక్కించారనీ, అలాగే జగపతిబాబు, ప్రియమణి సక్సెస్ ఫుల్ జంట అనీ, తానెంతో ఇష్టపడే సంగీత దర్శకుడు కీరవాణి అని బ్రహ్మానందం అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రేమకథలు ఎప్పుడూ ఫెయిల్ కావని కీరవాణి అన్నారు. నాటి దేవదాసు నుంచి మరో చరిత్ర, కొత్తబంగారులోకం వరకూ ప్రేమకథలు అలరిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రేమకు కొత్త నిర్వచనాన్ని మదన్ ఈ చిత్రంలో చెప్పారని తెలిపారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment