గంగోత్రి ఫిలింస్ సమర్పణలో తిరైపులి డాట్ కామ్ క్రియేషన్స్ 'నిను వీడని నీడను నేను' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబుగణేష్ కథానాయకుడుగా నటించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-సంగీతం కూడా అందిస్తున్నారు. వహీద, ఇబ్రాఖాన్, విక్టోరియా, స్టెఫీ హీరోయిన్లు. మరో హీరో శ్రీమాన్ నటిస్తుండగా, కృష్ణ భగవాన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ బంగ్లాలో జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఢిల్లీకి చెందిన సైంటిస్ట్ ఫాజియాఖాన్ క్లాప్ ఇవ్వగా, నటి కవిప్రియ కెమెరా స్విచ్చాన్ చేశారుహీరో, దర్శకనిర్మాత బాబుగణేష్ మాట్లాడుతూ, దయ్యం కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిదనీ, ఆద్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుందనీ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నామనీ, నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అద్భుతమైన గ్రాఫిక్స్ ఇందులో ఉంటాయనీ, ఐదుగురు అందాల తారలు తమ అందాలతో పాటు చక్కటి నటనను ప్రదర్శించనున్నారనీ తెలిపారు. హాస్యనటుడు పొట్టిరాంబాబు, తమిళ కమెడియన్ చిన్నిజయంత్ ఇందులో నటిస్తున్నారని చెప్పారు. అలాగే ఇందులోని ఐదు పాటలకు ఐదుగురు నృత్య దర్శకులు కొరియోగ్రఫీ అందిస్తారనీ, లండన్ లో ఫైనల్ మిక్సింగ్ జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వహీద, ఇబ్రాఖాన్, విక్టోరియా, స్టెఫీలతో పాటు నటుడు పొట్టిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి పొందూరి, రవి, శివశంకర్, పంచ్ భరత్, గిరి సాంకేతిక నిపుణులుగా వ్యవహరించనున్నారు.
No comments:
Post a Comment