వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా కె.ఫిలింస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.సునీల్ రెడ్డి నిర్మించిన చిత్రం 'కాస్కో'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. డాక్టర్ బ్రహ్మానందం ఆడియో సీడీని విడుదల చేసి తొలి ప్రతిని డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ఆడియో క్యాసెడ్ ను వి.వి.వినాయక్ ఆవిష్కరించి బి.గోపాల్ కు అందజేశారు. కోదండరామిరెడ్డి, జి.నాగేశ్వరరెడ్డి, వైభవ్, సునిల్ రెడ్డి, ఎన్.శంకర్, సంగీత దర్శకుడు ప్రేమ్ జీ అమరన్, భాస్కరభట్ల తదితరుల ఈ వేడుకలో పాల్గొన్నారుపరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తానూ, కొదండరామిరెడ్డి ఇంచుమించు ఒకేసారి పరిశ్రమలోకి వచ్చామనీ, ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామనీ అన్నారు. ఎంతో సీనియర్ దర్శకుడైనప్పటికీ ఎలాంటి భేషజాలు ఆయనకు లేవనీ, అందుకే అన్ని సినిమాలు చేయగలిగారనీ అన్నారు. ఆయనలోని లక్షణాలన్నీ వైభవ్ పుణికిపుచ్చుకున్నాడనీ, అతని తొలి సినిమాకి కూడా తాము పనిచేశామనీ చెప్పారు. ఈ సినిమాతో వైభవ్ తప్పుకుండా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాడని అన్నారు. వినాయక్ మాట్లాడుతూ, నాగేశ్వరరెడ్డి తనకు మంచి మిత్రుడనీ, మంచి హిట్లు ఇచ్చాడనీ, అయితే కథకు తగ్గట్టు ఆయనకు అన్నీ సమకూర్చగలిగితే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగాల్సిన దర్శకుడు ఆయనని అన్నారు. కోదండరామెరెడ్డి తనయులు ఒకరు హీరోగా, ఒకరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ సినిమాలో ఎక్కువ నిడివి గల పాత్రను పోషించాననీ, రెండ్రోజుల క్రితం వైభవ్ తన ఇంటికి వచ్చి పాటలు చూస్తారా అని అడిగాడనీ, సినిమా హీరోలు ఎవరూ వచ్చి అలా అడగరనీ, చాలా తెలివైన కుర్రాడు వైభవ్ అనీ ప్రశంసించారు. ఇందులో వైభవ్ చాలా బాగా నటించాడనీ, తప్పకుండా అతనికి కెరీర్ కు ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనీ అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇది తన ఎనిమిదో చిత్రమనీ, వంద సినిమాలు చేసిన దర్శకుడైన కోదండరామిరెడ్డి బ్యానర్ లో పనిచేయడం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. వైభవ్ డాన్స్ లు, ఫైట్లు, నటన అదరగొట్టాడనీ, అలాగే బ్రహ్మానందం మాత్రమే చేయగలిగిన పాత్రను ఆయన ఇందులో పోషించారనీ, నేను హిట్ ఇవ్వాలనుకుంటే బ్రహ్మానందం తన నటనతో సూపర్ హిట్ రేంజ్ కు తీసుకువెళ్లారనీ చెప్పారు. ఇళయరాజా సోదరుడి కుమారుడైన సంగీత దర్శకుడు ప్రేమ్ జీ అమరన్ మాట్లాడుతూ, ఇది సంగీత దర్శకుడుగా తన తొలి చిత్రమనీ, ఇందులోని ఆరు పాటలు చాలా బాగా వచ్చాయనీ చెప్పారు. వైభవ్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి తన సోదరుడు సునీల్ రెడ్డి బాగా కష్టపడ్డారనీ, అలాగే ప్రేమ్ జీ చక్కటి పాటలు, రీరికార్డింగ్ అందించారనీ చెప్పారు. వైభవ్ తొలి సినిమాను ఆదరించినట్టే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నట్టు కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 4న సినిమా విడుదల చేస్తామని చెప్పారు.
No comments:
Post a Comment