వరద బాధితుల సహాయార్థం ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'స్పందన' స్టార్ నైట్ కార్యక్రమానికి హాజరుకాని నటీనటులపై చర్యకు రంగం సిద్ధమవుతోంది. పరిశ్రమలోని అన్ని విభాగాల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఎవరైతే ఈ ఈవెంట్ కు దూరంగా ఉంటారో వారిపై నిషేధం విధిస్తామని ఈవెంట్ హానరరీ చైర్మన్ డాక్టర్ దాసరి నారాయణరావు స్టార్ నైట్ ముందు జరిగిన సమావేశంలో హెచ్చరించారు. దీనిని బేఖాతరు చేస్తూ ఈ ఈవెంట్ కు హాజరుకాని నయనతార, స్నేహలపై బ్యాన్ వేటు పడనుందని తాజా సమాచారం.ఏ పరిస్థితుల్లో స్టార్ నైట్ కు హాజరు కాలేదనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ నయనతార, స్నేహలకు ఈవెంట్ కన్వీనర్ నందమూరి బాలకృష్ణ నోటీసులు పంపారు. ఈ నోటీసుపై వారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అలాకాని పక్షంలో తెలుగు సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లకు అవకాశాలు లేకుండా బ్యాన్ అమలవుతుంది. ప్రస్తుతం నయనతార 'అదుర్స్' చిత్రంలోనూ, స్నేహ 'భవాని ఐపిఎస్', 'అమరావతి' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.
No comments:
Post a Comment