'వాడే కావాలి' డిసెంబర్ లో

సాయిరాం శంకర్, సుహాని జంటగా వీరు క్రియేషన్స్, శ్రీ సద్గురు సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వాడే కావాలి'. వీరేష్ బాబు, రఘునాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేందర్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.వి.ఆర్.మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బుధవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది
ఎస్.వి.ఆర్.మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇవో శోభారాణి మాట్లాడతూ, ఇదొక వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమనీ, సాయిరాం శంకర్ కు 'బంపర్ ఆఫర్' వంటి హిట్ తర్వాత ఇది మరో మంచి చిత్రమవుతుందనీ చెప్పారు. సాయిరాం శంకర్ ఈ చిత్రంలో మంచి డాన్స్ లు, ఫైట్స్ తో బాటు చక్కటి నటన ప్రదర్శించారని అన్నారు. నలభై రోజుల పాటు మలేసియాలో జరిపిన చిత్రీకరణ ఈ సినిమాకి హైలైట్ అవుతుందన్నారు. అలాగే ఇందులోని 6 పాటలకు ఆర్.పి.పట్నాయక్ చక్కటి సంగీతం అందించారనీ, పాటలు సాహిత్యపరంగానే గాకుండా దృశ్యపరంగా కూడా ఆకట్టుకుంటాయనీ చెప్పారు. నిర్మాత వీరేష్ బాబు మాట్లాడుతూ, సాయిరాం శంకర్ నటన, కథాకథనాలు ఎంతో నేచురల్ గా ఉండి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయనీ, ఆలీ, వేణుమాధవ్, రఘుబాబు మంచి కామెడీ పండించారనీ చెప్పారు. ఇదొక కొత్తతరహా ప్రేమకథా చిత్రమనీ, డిసెంబర్ ప్రథమార్థంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ దర్శకుడు దర్శన్ తెలిపారు.

No comments:

Post a Comment