'బంపర్' హిట్టిచ్చారు: పూరీ

హిట్ సినిమాలు తీయడం ఇటీవలకాలంలో చాలా కష్టమవుతోందనీ, 100 సినిమాలు విడుదలైతే అందులో 5 మాత్రమే విజయం సాదిస్తున్నాయనీ, ఆ ఐదింటిలో 'బంపర్ ఆఫర్' కూడా చేరినందుకు చాలా సంతోషంగా ఉందనీ పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథ, మాటలు కూడా అందించారు. సాయిరాం శంకర్, బిందుమాధవి జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శతమవుతోంది. రఘు కుంచె సంగీత సారథ్యంలో పూరీ సంగీత్ ద్వారా విడుదలైన ఆడియో అమ్మకాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆడియో 'ట్రిపుల్ ప్లాటినం' వేడుక హైద్రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 70 ఎంఎంలోఆదివారం సాయంత్రం ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగింది. పూరీ జగన్నాథ్, సాయిరాం శంకర్, బిందుమాధవి, జయరవీంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్, రఘు కుంచె, భాస్కరభట్ల, కెమెరామన్ సాయిశ్రీరామ్, ప్రొడక్షన్ డిజైనర్ రాజ్ కుమార్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ వర్మ, జూనియర్ రేలంగి, చిన్నా, వంశీ, సుదర్శన్ 70 ఎంఎం ప్రొప్రయిటర్ లక్ష్మణరావు, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, 'బంపర్ ఆఫర్' చిత్రం మంచి హిట్ కావడంతో సాయికి, హీరోయిన్ బిందుమాధవికి మంచి పేరొచ్చిందనీ, ఇంత మంచి హిట్ ఇచ్చిన తన మిత్రుడు, దర్శకుడు జయరవీంద్రకు చాలా చాలా థాంక్స్ అనీ అన్నారు. ప్రేక్షకుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ, బంపర్ ఆఫర్ ను సక్సెస్ ను చేసిన అందరికీ తన కృతజ్ఞతలనీ, అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన రఘు కుంచె, గేయరచయిత భాస్కరభట్లకు థాంక్స్ అనీ అన్నారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ చెప్పి ఆడియెన్స్ ను ఉత్సాహపరిచారు. రఘు కుంచె మాట్లాడుతూ, ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందనీ, తనకు ఈ అవకాశం ఇచ్చిన పూరీ జగన్ కు థాంక్స్ అనీ అన్నారు. 'రవణమ్మ...' పాట చిత్రానికి గ్రాండ్ ఓపినింగ్స్ తెచ్చిందన్నారు. ఆడియోతో పాటు సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

No comments:

Post a Comment