'ఆరంజ్' నుంచి శ్రుతి ఔట్!

రామ్ చరణ్ కొత్త చిత్రం నుంచి శ్రుతి హాసన్ తప్పుకున్నట్టు తాజా సమాచారం. 'మగధీర' చిత్రం తర్వాత రామ్ చరణ్ కథానాయకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగబాబు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో జెనీలియా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా శ్రుతిని ఎంపిక చేసినప్పటికీ ఆమె చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిందనీ సినీ వర్గాల సమాచరం
కమల్ హాసన్ కుమార్తె అయిన శ్రుతిహాసన్ ఇటీవలే 'ఈనాడు' చిత్రంతో సంగీత దర్శకురాలిగా పరిచయమై ఇప్పుడు నటిగా కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తాజాగా హీరో సిద్ధార్ధ కు జంటగా కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి నటిస్తోంది. ఈ క్రమంలోనే చరణ్ సినిమాకు ఆమె కమిట్ అయిందట. ఇందుకు సంబధించి ఆమె డేట్స్ కూడా ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకుందనీ, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ లో ఆమె పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అందుకు దూరంగా ఉండిపోయిందనీ తెలుస్తోంది. శ్రుతి తన నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇంకా తెలియలేదు. నిజానికి ఇందులో గెస్ట్ రోల్ కే శ్రుతి పరిమితమట. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపించాలట. దీనిని దృష్టిలో పెట్టుకునే శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఉండొచ్చని అంటున్నారు. శ్రుతి ప్లేస్ లో ఎవరిని తీసుకున్నారేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి 'ఆరంజ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

No comments:

Post a Comment