'రాజకుమారుడు' చిత్రంతో ప్రిన్స్ గా అభిమానులను అరిస్తూ వస్తున్న మహేష్ బాబుతో ఓ మెగా ప్రాజెక్ట్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగని దర్శకుడుగా పేరుతెచ్చుకుని 'మగధీర' 78 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులు బద్దలుకొట్టిన ఎస్.ఎస్.రాజమౌళి ఈ సంచనల చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారనే బలమైన ప్రచారం జరుగుతోంది. దీనిని భారీ చిత్రాల నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ 50 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి 'సామ్రాట్' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా 'మర్యాద రామన్న' అనే మీడియం బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు. 'మగధీర' చిత్రంతో 'పోకిరి' రికార్డులు బద్దలు కావడంతో తగిన సమయం తీసుకుని సరైన సబ్జెక్ట్ రెడీ చేస్తూ సరికొత్త రికార్డులు ఖాయమని ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. సెంటిమెంట్ గా 'సామ్రాట్'తో ముడిపడిన టైటిల్స్ బాక్సాఫీస్ ను ఆకట్టుకున్న దాఖలాలు కూడా లేవు. ఇదే టైటిల్ తో మహేష్ సోదరుడు రమేష్ బాబు నటించగా, బాలకృష్ణ 'సాహస సామ్రాట్', నటరత్న ఎన్టీఆర్ 'సమ్రాట్ అశోక్'లో నటించారు. అయితే రాజమౌళి గోల్డెన్ హ్యాండ్ గా పేరున్న రాజమౌళి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. నిజానికి 'మగధీర' చిత్రాన్ని సూపర్ కృష్ణ తీసిన 'సింహాసనం' చిత్రం సెట్స్ లో చేయాలని రాజమౌళి భావించారట. అయితే ఎప్పటికైనా మహేష్ తో తిరిగి 'సింహాసనం' రీమేక్ చేయాలని కృష్ణ పట్టుదలగా ఉండటంతో ఆ సెట్స్ ను రాజమౌళి ఉపయోగించుకునేందుకు కృష్ణ ఇష్టపడలేదట. ఇప్పుడు మహేష్ హీరోగా ఇదే రాజమౌళి దర్శకత్వంలో సినిమా కావడంతో కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా లేదు. కథ కూడా 'సింహాసనం' లైన్స్ లో అల్లుకున్నప్పటికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఏమి జరుగుతుందనేది చూడాలి
No comments:
Post a Comment