పవన్, మహేష్ పై వేటు?

'స్టార్ నైట్'లో ఎవరెవరు పాల్గొంటారు? చిరంజీవి ఫ్యామిలీ దూరంగా ఉంటుందా? ఇగోలు, స్టార్స్ లో విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటూ స్టార్ నైట్ ముందు పలు ప్రశ్నలు తలెత్తినప్పటికీ చివరికి ఎలాంటి రసాభాస లేకుండా సుమారు 5.30 గంటల సేపు జరిగిన 'స్పందన' విజయవంతంగా ముగిసింది. దాసరి నారాయణరావు, బాలకృష్ణ స్యయంగా తగినంత చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం అందరి ప్రశంసలు అందుకుంది. దాసరి స్వయంగా వ్యాఖ్యాతగా కూడా మారి తన పార్టిసిపేషన్, నిర్వహణా పటిమ ఎలాంటిందో చాటుకున్నారు. ఓవైపు అందర్నీ మొబెలైజ్ చేసి, మరోవైపు రిహార్సల్స్ పర్యవేక్షిస్తూ, తాను కూడా రిహాల్సర్స్ చేస్తూ బాలకృష్ణ సవ్యసాచిలా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. ఇంత సంబరంలోనూ ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి గైర్వాజరు కావడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.ఈ ప్రోగ్రాంలో పాల్గొనని తారలపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తామని దాసరి గతంలో విస్పష్టంగా చెప్పారు. అనారోగ్య కారణాలు ఏవైనా ఉంటే మినహాయింపు ఉండే అవకాశం మాత్రం ఉంది. సహజంగా పబ్లిక్ ఫంక్షన్లకు మహేష్, పవన్ దూరంగా ఉంటారు. అయితే అది పూర్తిగా వ్యక్తిగతమే అయినా ఒక నోబుల్ కాజ్ కోసం పరిశ్రమ యావత్తూ కలిసికట్టుగా తలపెట్టిన ప్రోగ్రాంకు వీరిరువురు దూరంగా ఉండటమే విమర్శలకు దారితీస్తోంది. సాటి హీరోల అభిమానులు సగర్వంగా తమ హీరో ఓ నోబుల్ కాజ్ కోసం ఎంతో కష్టపడ్డారని సగర్వంగా చెప్పుకునే ఇలాంటి తరుణంలో మహష్, పవన్ లు తమ అభిమానులకు అలాంటి అవకాశం ఇవ్వకపోవడం లోటే. దీనికి సదరు హీరోలు ఎలాంటి వివరణ ఇస్తారో మరి...

No comments:

Post a Comment